ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సముద్ర టూరిజం, మోడీ బ్రాండ్..

సముద్ర టూరిజం, మోడీ బ్రాండ్..

సింగపూర్, థాయ్ లాండ్, మాల్దీవులు, శ్రీలంక, ఇండోనేషియా సహాచాలా దేశాలు... టూరిజాన్ని ఆసరాగా చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. భారత దేశంలోని ఓ రాష్ట్రం అంత భూభాగం కూడా లేని పలుదేశాలు.. విదేశీ మారకద్రవ్యం ఆర్జించడంలో ముందున్నాయి. కానీ..సువిశాల భారత దేశం మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడి ఉంది. ఒక్క గోవా తప్ప మిగిలిన రాష్ట్రాలు అరకొరగానే టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను ఒడిసిపట్టడంలో భారత్ విఫలమవుతోంది. అయితే ఈ పాయింట్‌ను భారత ప్రధాని మోడీ గుర్తించారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

మొన్నటికి మొన్నలక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోడీ..ఆప్రాంతం అందాలను ప్రపంచానికి పరిచయం చేశారు. లక్షద్వీప్ స్కూబా డైవింగ్‌కు అనుకూలమని.. ఈవాతావరణాన్ని ఆస్వాదించవచ్చని పర్యాటకులకు సూచించారు. దీనికి తోడు తన స్కూబా డైవింగ్ విజువల్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో దేశంలోని వీఐపీలు.. ఒక్కసారిగా లక్షద్వీప్‌పై ఫోకస్ పెట్టారు. లోకల్‌కే పెద్దపీట వేయాలంటూ ట్రెండింగ్ చేశారు. దీంతో మాల్దీవులు, సింగపూర్ లాంటి దేశాలను వదిలి పలువురు ఇండియాలోనే వెకేషన్ గడపడం ప్రారంభించారు. లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ఫోకస్ పెట్టారు.

ఇప్పుడు ప్రధాని మోడీ టెంపుల్ టూరిజంపైనా ఫోకస్ పెట్టారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ సుదర్శన సేతుని ప్రారంభించిన తర్వాత, ద్వారకదీష్ ఆలయంలో పూజలు చేశారు. అదే సమయంలో సముద్రంలో కాసేపు సేదదీరారు. బెట్ ద్వారక ద్వీపం వద్ద స్కూబా డైవింగ్ చేశారు. ఇక్కడే ద్వారకా నగరపు ఆనవాళ్లు ఉన్నాయి. సరిగ్గా ఈ చోటే ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా తన అనుభూతి పంచుకున్నారు. అద్వితీయమైన భక్తిభావంలో మునిగిపోయానంటూ పోస్ట్ పెట్టారు. ఆ శ్రీకృష్ణుడు అందరికీ ఆశీర్వాదం అందించాలని ఆకాంక్షించారు.

ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్షద్వీప్ సాదారణ పర్యాటకులకు నెలవుగా మారొచ్చు కానీ.. ద్వారక అలా కాదు.. ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం. సముద్రంలో ద్వారకానగరం మునిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఇక్కడకు వెళ్లి స్కూబా డైవింగ్ చేస్తే, పుణ్యానికి పుణ్యం, ఆనందానికి ఆనందం.... ఆకృష్ణమూర్తి నడయాడిన నేలపై తిరుగాడిన ఫీలింగ్.. వింటేనే ఒళ్లు పులకరిస్తుంది. మరి అలాంటి చోట, మోడీలాంటి నేత.. డైవింగ్ చేసి చూపిస్తే ఎలా ఉంటుంది. ఇంకేముంది ద్వారక కూడా స్కూబా డైవింగ్‌కు నెలవుగా మారుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :