ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆఫీస్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ హవా

ఆఫీస్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ హవా

ఆఫీస్‌ మార్కెట్‌లో ఇకపైనా హైదరాబాద్‌ హవా కొనసాగనున్నది. కార్యాలయ స్థలాలకు హైదరాబాద్‌లో ఉన్నంత డిమాండ్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో మరెక్కడా కనిపించదన్న అంచనాలున్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగానే ఈ 2023-2025 కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో వచ్చే ఆఫీస్‌ స్పేస్‌లో హైదరాబాద్‌, బెంగళూరు వాటానే 49 శాతంగా ఉండొచ్చని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ అంటున్నది. ‘ఆఫీస్‌ మైథ్స్‌ డీబంక్డ్‌’ పేరుతో సీబీఆర్‌ఈ దక్షిణాసియా విభాగం ఓ కొత్త నివేదికను విడుదల చేసింది. ఆయా రంగాల్లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను అంతర్జాతీయ కార్పొరేట్లు మరిన్ని తీసుకురాబోతున్నారని చెప్పింది. 

హైదరాబాద్‌లో బెంగళూరు కంటే ఎక్కువగా జీసీసీలు కొలువుదీరబోతున్నాయని ఇటీవలి ఓ నివేదికలో తేలిన సంగతి విదితమే. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణె, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ తీరుతెన్నులపై సీబీఆర్‌ఈ రిపోర్టు వచ్చింది. ఇందులో 2023-2025లో ఈ ఏడు నగరాల్లో కొత్తగా 165 మిలియన్‌ చదరపు అడుగులకుపైగా ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రావచ్చని ఉన్నది. 2020-2022లో వచ్చిన ఆఫీస్‌ స్పేస్‌ కంటే ఇది అధికం. నాడు 142 మిలియన్‌ చదరపు అడుగుల్లో ఆఫీస్‌ స్పేస్‌ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. కాగా, 2020 నుంచి 2022 వరకున్న మూడేండ్ల వ్యవధిలో ఆఫీస్‌ సైప్లె వార్షిక సగటు 17 శాతం పెరిగిందని, భవన పరిమాణం సగటు సైతం 18 శాతం ఎగిసిందని సీబీఆర్‌ఈ ఈ సందర్భంగా తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ 2023-2025లో ఆఫీస్‌ సైప్లె, భవన పరిమాణంల వార్షిక సగటు మరో 15-18 శాతం పెరుగవచ్చన్నది.

2023-2025లో రాబోయే 165 మిలియన్‌ చదరపు అడుగులకుపైగా ఆఫీస్‌ స్పేస్‌లో హైదరాబాద్‌లోనే 33 మిలియన్‌ చదరపు అడుగులు రావచ్చని సీబీఆర్‌ఈ తెలిపింది. మొత్తం అంచనాలో ఇది 20 శాతానికి సమానం. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 28 మిలియన్‌ చదరపు అడుగులు (17 శాతం), పుణెలో 19.8 మిలియన్‌ చదరపు అడుగులు (12 శాతం), చెన్నైలో 18.15 మిలియన్‌ చదరపు అడుగులు (11 శాతం), ముంబైలో 14.8 మిలియన్‌ చదరపు అడుగులు (9 శాతం), కోల్‌కతాలో 3.3 మిలియన్‌ చదరపు అడుగులు (2 శాతం) మేర కొత్తగా కార్యాలయ స్థలాలు రానున్నాయి. అయితే ఈ మూడేండ్లలో బెంగళూరులో అత్యధికంగా 47.8 మిలియన్‌ చదరపు అడుగుల (29 శాతం) ఆఫీస్‌ స్పేస్‌ రాబోతున్నది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :