ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పాన్ ఇండియ‌న్ సాంగ్‌తో అల‌రిస్తున్న రాక్ స్టార్

పాన్ ఇండియ‌న్ సాంగ్‌తో అల‌రిస్తున్న రాక్ స్టార్

ఫేమ‌స్ సౌత్ ఇండియ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో క్రేజీ ప్రాజెక్టుల‌తో బాగా బిజీగా ఉన్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మ్యూజిక్‌తో మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను అల‌రించే డీఎస్పీ ఈసారి ఓ పిల్లా అనే పాప్ సాంగ్‌తో వ‌చ్చాడు. రీసెంట్‌గా డీఎస్పీ ఓ పారి అనే హిందీ మ్యూజిక్ ఆల్బ‌మ్‌ను ర‌బ్‌వీర్ సింగ్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. దేవీశ్రీ చేసిన ఫ‌స్ట్ మ్యూజిక్ ఆల్బ‌మ్ ఇదే.

ఇప్పుడు ఈ సాంగ్‌ను తెలుగు, త‌మిళ వెర్ష‌న్స్‌లో రిలీజ్ చేశారు తెలుగులో ఓ పిల్లా పేరుతో రూపొందిన ఈ సాంగ్‌ను బిగ్‌బాస్ స్టేజ్ మీద నాగార్జున లాంచ్ చేయ‌గా, త‌మిళ వెర్ష‌న్‌లో ఓ పెన్నీ సాంగ్‌ను త‌మిళ్ బిగ్‌బాస్ హోస్ట్ క‌మ‌ల్ హాస‌న్ రిలీజ్ చేశారు. ఓ పిల్లా నీ క‌న్నులే ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్ అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను తెగ అల‌రిస్తోంది. ఈ సాంగ్‌కు దేవీ శ్రీ ట్యూన్ క‌ట్ట‌డ‌మే కాకుండా తానే అన్ని భాష‌ల్లో రాసి, న‌టించి, పాడాడు కూడా. అంతేకాదు ఈ సాంగ్‌కు కొరియోగ్ర‌ఫీ, ఎడిటింగ్, కాన్సెప్ట్ డిజైన్, ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు కూడా డీఎస్పీనే నిర్వ‌హించాడు.

స్పెయిన్, ఆస్ట్రేలియా, అమెరికాలోని అంద‌మైన లొకేష‌న్స్‌లో ఈ సాంగ్‌ని షూట్ చేశారు. చాలా రోజుల త‌ర్వాత డీఎస్పీ ఇలా సాంగ్‌లో ఆడిపాడ‌టంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే పుష్పతో త‌న క్రేజ్‌ను వ‌రల్డ్ వైడ్ చేసుకున్న దేవీశ్రీప్ర‌సాద్ ప్ర‌స్తుతం పుష్ప‌2 కోసం తెగ క‌ష్ట‌ప‌డ‌తున్నాడు. ఇవి కాకుండా వాల్తేరు వీర‌య్య‌, భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ సినిమాల‌కు కూడా దేవీనే స్వ‌రాలు స‌మకూరుస్తున్నారు. మొన్న జ‌రిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో దేవీ శ్రీ కి పుష్ప సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అవార్డు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :