చిరంజీవి సినిమాల్లో ఎన్టీఆర్ ఫేవ‌రెట్ అదేన‌ట‌

చిరంజీవి సినిమాల్లో ఎన్టీఆర్ ఫేవ‌రెట్ అదేన‌ట‌

ఏదో తిన్న‌ది అర‌గ‌క‌నో, ఈగోల‌కు పోయో ఫ్యాన్స్ త‌మ హీరో సినిమా గొప్ప‌దంటే త‌మ హీరో సినిమా గొప్ప‌ద‌ని గొడ‌వలు ప‌డ‌టం త‌ప్పించి, హీరోలు అంద‌రూ చాలా క‌లివిడిగా ఉంటుంటారు. వారి మ‌ధ్య ఎలాంటి ద్వేషాలు, పంతాలు ఉండవు. ఒక‌రి సినిమాల‌ను మ‌రొక‌రు చూసుకుంటూ వారిని అప్రీషియేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. 

ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ చిరంజీవి గురించి ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ టైమ్ లో చెప్పిన మాట‌లు కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చాయి. త‌న‌కు చిరంజీవి సినిమాల్లో రుద్ర‌వీణ అనే సినిమా అంటే చాలా ఇష్ట‌మని, రుద్ర‌వీణ‌ని తీసిన విధానం ఎంతో అద్భుతంగా ఉంటుద‌ని, బాక్సీఫీస్ వ‌ద్ద సినిమా ఆడ‌క‌పోయినా మెగాస్టార్ లోని మంచి న‌టుడిని బ‌య‌ట‌కు తీసుకొచ్చింది రుద్ర‌వీణ సినిమానే అని తార‌క్ ఆ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. 

అంతేకాదు, హీరోలు త‌మ క్రేజ్ ను, మార్కెట్ ను ప‌క్క‌న‌పెట్టి యాక్ట‌ర్ గా త‌మ‌కు సంతృప్తినిచ్చే పాత్రల కోసం కొన్ని రిస్క్ లు చేస్తార‌ని, అలా సీనియ‌ర్ ఎన్టీఆర్, చిరంజీవి రిజ‌ల్ట్ తో ప‌నిలేకుండా చాలా సినిమాలు చేశార‌ని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. ఎన్టీఆర్ చెప్పిన ఆ మాట‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :