ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యోగీ మరో ప్రయత్నం...

యోగీ మరో ప్రయత్నం...

మాఫియా డాన్‌ల తాట తీస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ .. ఇప్పుడు ఏకంగా శాసనసభా సమావేశాల తీరు తెన్నులపై కన్నేశారు. శాసన సభలో సభ్యులు పత్రాలను చింపుతూ, గందరగోళం సృష్టిస్తూ హంగామా సృష్టించడాన్ని గమనించారు. ఇకపై శాసన సభ హుందాగా, ప్రశాంతంగా కనిపించేలా చేయడానికి ఆయన నడుం బిగించారు. త్వరలోనే సభ్యులకు నూతన నిబంధనలను రూపొందించనున్నారు.

ఉత్తర ప్రదేశ్ శాసన సభ కార్యకలాపాల నిర్వహణ, విధానపరమైన నిబంధనలు, 2023 ప్రకారం, సభ్యులు తమతోపాటు మొబైల్ ఫోన్లను శాసనసభలోకి తీసుకెళ్లకూడదు. శాసన సభలో పత్రాలను చింపడం, అనవసరంగా సభాపతికి తమ వెనుక భాగం కనిపించేలా నిల్చోవడం లేదా కూర్చోవడం వంటివి చేయకూడదు. సభలో మాట్లాడుతున్నపుడు గ్యాలరీలో ఉన్నవారిలో ఎవరివైపూ వేలెత్తి చూపించకూడదు, ప్రశంసించకూడదు. సభలోకి ఆయుధాలను తీసుకెళ్లకూడదు, ప్రదర్శించకూడదు. లాబీల్లో ధూమపానం చేయరాదు, గట్టిగా నవ్వకూడదు.

సభ్యులు సభాపతి స్థానంవైపు చూస్తూ వంగి గౌరవం ప్రదర్శించాలి. సభలోకి ప్రవేశించేటపుడు లేదా సభ నుంచి వెళ్లిపోయేటపుడు లేదా కూర్చునేటపుడు లేదా తమ స్థానాల నుంచి లేచి నిల్చునేటపుడు తమ వీపు భాగం సభాపతి స్థానం వైపు పెట్టకూడదు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ కార్యకలాపాల నిర్వహణ, విధానపరమైన నిబంధనలు, 1958ని సవరిస్తూ ఈ నిబంధనలను ఆమోదించబోతున్నారు.

శాసన సభను సమావేశపరచడానికి సమన్ జారీ చేసే సమయాన్ని 14 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించారు. ప్రొసీడింగ్స్‌కు సంబంధంలేని పుస్తకాలు, సాహిత్యం, ప్రశ్నావళి, ప్రెస్ కామెంట్స్, చీటీలు వంటివాటిని సభలోకి తీసుకురాకూడదు, వాటిని సభ్యులకు పంపిణీ చేయకూడదు. ప్రతి రోజూ నిర్వహించే కార్యకలాపాల వివరాలను ఎమ్మెల్యేలకు ఆన్‌లైన్లో లేదా ఆఫ్‌లైన్ లో ఓ జాబితాను శాసన సభ ప్రిన్సిపల్ సెక్రటరీ తరపున పంపిస్తారు.

ఇవి కానీ విజయవంతంగా అమలైతే... ఇక అన్ని రాష్ట్రాలు దీన్నే అవలంబించే అవకాశముంది. ఓవైపు ఇది వినేందుకు బాగానే ఉన్నా.. విపక్షాల గొంతు నొక్కే పరిస్థితి ఏర్పడే ప్రమాదముంది. అంటే ఇక దేనిపైనా విపక్షాలు గట్టిగా ఫోకస్ చేయలేవు. ఫలితంగా సభలోనూ బుల్ డోజ్ విధానం అమలయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :