ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

స్టార్ హీరోయిన్ పై నయన్ సంచలన కామెంట్స్...

స్టార్ హీరోయిన్ పై నయన్ సంచలన కామెంట్స్...

తెలుగు, తమిళం చిత్ర సీమలో లేడీ సూపర్ స్టార్ గా నయనతార అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు చాలా కాలం తర్వాత స్పెషల్ ఇంటర్వ్యూతో మీడియా ముందుకు వచ్చింది. నయనతార హీరోయిన్ గా నటించిన "కనెక్ట్" సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నయనతార మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

తన సినిమా జర్నీ లో ఇప్పటి వరకు నయనతార సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన సందర్భాలు వేళ్ళ మీద లెక్కించొచ్చు. "శ్రీరామ రాజ్యం" సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది నయనతార. కనెక్ట్ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంది. తన పై గత కొన్నాళ్లుగా వస్తున్న విమర్శలకు గట్టిగానే సమాధానం ఇచ్చింది. అదే విధంగా  తన గురించి ఇతరులు అనుకుంటున్న మాటలకు కూడా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్ క్లారిటీ ఇచ్చింది.కొన్నాళ్ల క్రితం నయన్ మరియు ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహన్ మధ్య కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే.

అప్పుడు  హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన వ్యాఖ్యలకు నయనతార సున్నితంగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం నయన్ మరియు మాళవిక మోహన్ మధ్య జరిగిన సంభాషణలు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ లో మాళవిక మోహనన్ మాట్లాడుతూ నయనతార పేరు ఎత్తకుండా, ఒక  హీరోయిన్ యాక్సిడెంట్ అయ్యి చావుబతుకుల్లో ఉన్న సన్నివేశం లో కూడా మేకప్ వేసుకుని కనిపించింది.

అలాంటి సీన్లలో కూడా ఐ లైనర్, మేకప్ తో ఎలా నటిస్తారో అర్థం కాలేదు అంటూ నయనతార పై మాళవిక కామెంట్స్ చేసింది.నయన్ ఈ కామెంట్స్ పై మాట్లాడుతూ, ఆ హీరోయిన్ ఇంటర్వ్యూ చూశాను. ఆమె నా పేరు ఎత్తలేదు కానీ ఆమె అన్నది నా గురించే అని నాకు అర్థం అయ్యింది. ఆమె చెప్పినట్లుగానే నేను ఆ సన్నివేశంలో మేకప్ తోనే నటించాను.

అయితే పాత్ర మరియు సినిమా డిమాండ్ మేరకు నేను మినిమం మేకప్ లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి.  ఆ సీన్ డిమాండ్ చేయబట్టే యాక్సిడెంట్ సీన్ లో కూడా తాను అలా కనిపించాల్సి వచ్చింది. డైరెక్టర్ చెప్పినట్టుగానే నేను నటిస్తాను. దర్శకులు కమర్షియల్ సినిమాల కోసం ఎలా నటించాలి అంటే అలా నటించాను అని నయనతార చెప్పుకొచ్చింది. ఈ కోల్డ్ వార్ కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారో చూడాలి. నయన్ మాటలకి మాళవిక రియాక్షన్ ఏంటీ అనేది చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :