ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రాజెక్ట్ కె - ప్రతీదీ అద్భుతమే!

ప్రాజెక్ట్ కె - ప్రతీదీ అద్భుతమే!

రాధే శ్యామ్ త‌ర్వాత ప్ర‌భాస్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలే ఉన్నాయి. అమితాబ్, దీపికా ప‌దుకొణె లాంటి పెద్ద స్టార్ కాస్ట్ ఉండ‌టంతో సినిమా మొద‌లైన నాటి నుంచే మూవీపై మంచి హైప్ ఉంది. దానికి తోడు సినిమాకు ప్రాజెక్ట్ కె అని టైటిల్‌ను ఫిక్స్ చేయ‌డంతో అంచ‌నాలు ఇంకా పెరిగాయి. 

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ ఈ సినిమాను పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా రూపొందిస్తుంది. ప్రాజెక్ట్ కె సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తున్నాడు. మొద‌ట్లో ఈ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ ను సంగీత ద‌ర్శ‌కుడిగా అనుకున్నారు కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల తెర‌మీద‌కు సంతోష్ వ‌చ్చాడు. 

ఒక ఏడాది నుంచి ప్రాజెక్ట్ కె కు సంతోష్ వ‌ర్క్ చేస్తున్న‌ట్లు తెలిపాడు. అంతే కాదు ప్రాజెక్ట్ కె లాంటి అద్భుత‌మైన మూవీకి తాను వ‌ర్క్ చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉందంటూ రీసెంట్ గా ఓ  ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు సంతోష్. సినిమా యూనిట్ మొత్తం ప్రాణం పెట్టి సినిమా కోసం ప‌ని చేస్తున్న‌ట్లు, సినిమా రిలీజ్ అయ్యాక ఓ అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ క‌లుగుతుంద‌న్నారు.

అంతేకాకుండా సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కిన ప్ర‌తీ సీన్, ప్ర‌తీ సాంగ్ ఎంతో అద్భుతంగా వ‌చ్చాయ‌ని ఆయ‌న పేర్కొన్నాడు. ఈ సినిమాతో దీపికా టాలీవుడ్‌లో అడుగు పెట్ట‌నుంది. అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారిని అల‌రించే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న విష‌యం తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :