ASBL NSL Infratech

అభిమానులపై ఫైర్ అయిన ఆలియా భట్..

అభిమానులపై ఫైర్ అయిన ఆలియా భట్..

ఈ మధ్య ఫ్యాన్స్ వల్ల సెలబ్రిటీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో అనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా ఫ్యాన్స్ అత్యుతత్సాహం వల్ల చాలా మంది సెలబ్రిటీస్, ఫేమస్ పర్సనాలిటీస్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం వింటూనే ఉన్నాం. వాళ్ళు కూడా మామూలు మనుషులే అని, వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని ప్రేక్షకులు, అభిమానులు కాస్త గుర్తుపెట్టుకుంటే ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ తరుణంలో రీసెంట్ గా బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అలియా భట్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది.

తాను టెర్రస్ పై ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరు కుర్రాళ్ళు ఎదురు ఇంటిపై నుండి వీడియోలు తీశారు అంటూ ఆలియా భట్ పోలీసులకి కంప్లైంట్ చేసారు. నా ప్రైవసీ లోకి వాళ్ళు ప్రవేశించారు, చాలా భయపడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం ఈ న్యూస్ బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరైనా ఒకరి పర్సనల్ లైఫ్ లోకి వారి అనుమతి లేకుండా ఇలా ఫోటోలు తీయడం తప్పే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

"నేను ఇంట్లో మామూలుగా మధ్యాహ్నం నా గదిలో కూర్చొని ఉన్నప్పుడు ఏదో నన్ను చూస్తున్నట్లు అనిపించింది. నేను పైకి చూసాను. నా పొరుగు భవనం టెర్రస్ పై నుంచి నా వైపే కెమెరాతో చిత్రీకరిస్తూ ఇద్దరు వ్యక్తులు కనిపించారు! ఇది సరైన పనేనా? ఎలా అనుమతించాలి? ఇది ఒకరి గోప్యతపై స్థూలమైన దాడి! మీరు దాటలేని ఒక గీత ఉంది. ఈ రోజు అన్ని గీతలు దాటేశారని  చెప్పడం సురక్షితం! @ముంబైపోలీస్" అని ఆలియా భట్ ముంబై పోలీసులని టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో రాసింది. ఇక ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పటికే దర్యాప్తుని ప్రారంభించారని తెలుస్తుంది.

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :