ASBL NSL Infratech

అమెరికాలో భారతీయ విద్యార్థులకు... దొరకని ఇంటర్న్ షిప్ లు

అమెరికాలో భారతీయ విద్యార్థులకు... దొరకని ఇంటర్న్ షిప్ లు

భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు నిరాశే ఎదురవుతున్నది. అమెరికాలో కనీసం ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లూ దొరకడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించి బడా కార్పొరేట్‌ కంపెనీల్లో కొలువులను పట్టాలంటే ఈ ఇంటర్న్‌షిప్‌ చాలా చాలా ముఖ్యం. కానీ ఆర్థిక మందగమనం ప్రభావంతో స్థానికులకే అక్కడి సంస్థలు అవకాశాల్ని ఇస్తున్నట్టు విద్యార్థులు, ఎడ్యుకేష్‌ కన్సల్టెంట్లు, ఇండో`అమెరికన్‌ ప్రొఫెషనల్స్‌ చెప్తున్నారు.  ఈ ఏడాదే అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఉండటం పరిస్థితుల్ని ప్రభావితం చేస్తున్నట్టు వారు పేర్కొంటున్నారు.

ఇక ద్రవ్యోల్బణం, అధిక జీవన వ్యయం, నిరుద్యోగం, స్పాన్సర్‌షిప్‌ సమస్యలు, భారతీయ విద్యార్థులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. అమెరికా అత్యుత్తమ విద్యా సంస్థలైన ఎన్‌వైయూ స్టెర్న్‌, యూసీ బెర్క్‌లీ, బ్రౌన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వెనియూ,  యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకూ ఈసారి సమ్మర్‌లో ఇంటర్న్‌ షిప్‌ ఆఫర్లు లేవు అని ఎడ్యుకేషన్‌ కన్సల్టింగ్‌ కంపెనీ కాలేజీ సహ వ్యవస్థాపకుడు ఆదర్శ్‌ ఖండేల్వాల్‌ అన్నారు. 

గత ఆరు నెలలుగా ఎన్నో కంపెనీల్లో దరఖాస్తు చేశాను. అయినా ఫలితం లేదు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ (స్టెమ్‌) విద్యార్థులకూ ఇబ్బందులు తప్పడం లేదు అని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌, సైకాలజీలను చదువుతున్న 22 ఏండ్ల ఫైనలియర్‌ గ్రాడ్యుయేట్‌ ఒకరు తెలిపారు. నిజానికి కరోనాకు ముందు స్టెమ్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ల్లో భారీగా అవకాశాలుండేవని సదరు విద్యార్థి అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :