ఎన్ఆర్ఐ లకూ యూపీఐ చెల్లింపుల సౌకర్యం
![ఎన్ఆర్ఐ లకూ యూపీఐ చెల్లింపుల సౌకర్యం](https://www.telugutimes.net/storage/news/news_new_72843.jpg)
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎన్ఆర్ఐ ఖాతాదారుల కోసం మరో ప్రత్యేక సౌలభ్యం కల్పించింది. వీరు ఇక తమ ఎన్ఆర్ఈ /ఎన్ ఆర్ఓ ఖాతాలతో అనుసంధానమైన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ నంబర్ల ద్వారా దేశంలో యూపీఐ చెల్లింపులను అప్పటికప్పుడు చేయవచ్చు. దీంతో తమ ఎన్ఆర్ఐ ఖాతాదారులు రోజువారీ చేసే యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, మర్చంట్ అండ్ ఈ కామర్స్ లావాదేవీలు అత్యంత సౌకర్యవంతంగా మారతాయని బ్యాంక్ తెలిపింది. తమ ఐమొబైల్ పే యాప్ ద్వారా ఎన్ఆర్ఐ ఖాతాదారులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్ఆర్ఐ ఖాతాదారులకు మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుందని బ్యాంక్ తెలిపింది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :