ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇండియాకు 'మోడీ'యే శ్రీరామరక్ష..?

ఇండియాకు 'మోడీ'యే శ్రీరామరక్ష..?

విపక్ష ఇండియా కూటమిలో వివిధ రకాల పార్టీలున్నాయి. వాటి అజెండాలు వేరు.. వాటి సిద్ధాంతాలు వేరు.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతో అవి తలపడుతున్నాయి. కాబట్టి అవి పూర్తిస్థాయిలో రాజకీయంగానే ఆలోచిస్తాయి. తమకు లబ్ధి చేకూరుతుందంటే... కలుస్తాయి, లేదంటే ... దూరం పాటిస్తాయి . అలాంటి పార్టీలన్నీ ఒక్క గొడుగుగా ఏర్పడి ఇండియా కూటమిగా మారాయి. దీనికి కారణం సాక్షాత్తూ ప్రధానమంత్రి మోడీ. ఒక్క పార్టీగా మోడీని గద్దెదించలేమని గుర్తించిన విపక్షాలు .. కూటమిగా ఏర్పడ్డాయి. అంటే కూటమి ఏర్పాటుకు బీజం వేసింది మోడీ అనే చెప్పాలి. కూటమి బలోపేతానికి సైతం మోడీనే.. కారణమవుతున్నారని చెప్పాల్సిందే. ఎందుకంటే విపక్ష ఎంపీలను ఖాతరు చేయని మోడీ తీరు.. అవన్నీ కలసికట్టుగా నడవాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నాయి.

ఆరంభంలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన మణిపూర్ అల్లర్ల ఘటన..మోడీ దాన్ని పక్కకు పెట్టారు. దీంతో విపక్షనేతలందరూ కలసి... మణిపూర్ లో క్షేత్రపర్యటన చేశారు. మోడీ సర్కార్ తీరును తప్పుపట్టారు. అదే మోడీ తానే నేరుగా మణిపూర్ అంశంపై స్పందించి ఉంటే.. విపక్షనేతలు తాము గీసుకున్న గిరిలోనే ఉండేవారని చెప్పక తప్పదు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం తప్పలేదు. ఒక్క తెలంగాణ తప్పిస్తే.. ఎక్కడా హస్తానికి .. ప్రజామోదం దక్కలేదు. కాంగ్రెస్ అనుసరించిన విధానం వల్లే.. ఈఫలితాలని మిగిలిన పార్టీలు ఆరోపించాయి . ఫలితంగా ఇండియా కూటమిలో లుకలుకలు మరోసారి వెలుగుచూశాయి. ఈ తరుణంలో పార్లమెంటులో స్మోక్ కల్లోలం ఘటన.. మళ్లీ కూటమికి ఆయుధాలిచ్చిందనే చెప్పాలి. విపక్ష ఎంపీలు సభను అడ్డుకోవడం.. సస్పెన్షన్ కు గురికావడం జరిగిపోయింది. దీంతో విపక్షాలన్నీ మరోసారి .. ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసుకుని.. ఎన్నికల సన్నద్ధతపై చర్చించాయి. అంటే.. మరోసారి కూటమినేతలను ఐక్యపరచడంలో మోడీ .. పరోక్షంగా తన వంతు కృషి చేశారని చెప్పాలి.

ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ పదేపదే విపక్ష కూటమిని దెప్పిపొడుస్తూ వస్తున్నారు. ఓటమి పాలయ్యారు. ఓటమి పాలయ్యారు అని.. అంటే.. వారిలో పౌరుషాన్ని రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. దీని ఫలితంగానే మంగళవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. ప్రధాని మోడీకి తాను తప్ప దేశాన్ని ఇంకెవ్వరూ కాపాడలేరన్న గర్వం ఉందన్నారు. అందుకే మోడీ సర్కార్ ను గద్దె దించేందుకు కూటమి నేతలు కలిసికట్టుగా ప్రయత్నిస్తామన్నారు.

సాదారణంగా మోడీ స్థాయి నేతకు.. విపక్ష కూటమిని చీల్చడం పెద్దపని కాదు. కానీ ఎందుకో తెలియదు కానీ..ఎన్నికల సమయంలో మాత్రం చిన్నా,చితక పార్టీలను కలుపుకుంటూ.. వారి పొత్తుతో ముందుకెళ్తున్నారు. కూటమిలో పెద్దతలకాయలపై ఫోకస్ పెట్టడం లేదు. ఒక్క నితీష్ కుమార్ పట్ల మాత్రం బీజేపీ నేతలు సానుకూలంగా ఉన్నారు. కానీ..ఆయనకు మోడీ, షా గురించి బాగా తెలుసు కాబట్టి... అవసరానికి తగినట్లుగా ప్రవర్తిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :