ASBL NSL Infratech

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజు రోజుకీ మరింత అధికమవుతోంది. 24 గంటల వ్యవధిలో 31,812 నమూనాలను పరీక్షించగా 2,331 మందికి కొవిడ్‍ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‍లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,13,274కి చేరింది. ఒక్కరోజులో 11 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‍తో మృతి చెందిన వారి సంఖ్య 7,262కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 853 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం 13,276 యాక్టివ్‍  కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,02,583 నమూనాలను పరీక్షించారు. ఇప్పటికి 8,92,736 మంది పూర్తిగా కోలుకున్నట్లు ప్రభుత్వం బులెటిన్‍లో పేర్కొంది.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :