ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

13 తర్వాత లోక్ సభ షెడ్యూల్!

13 తర్వాత లోక్ సభ షెడ్యూల్!

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 13వ తేదీ తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వర్గాలు తెలిపాయి. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు ఈసీ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలు ముగియగానే షెడ్యూల్‌  విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వెల్లడిరచాయి. ఈసీ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నది. త్వరలో ఉత్తరప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నది. మార్చి 13 వరకు ఈ పర్యటనలు ముగియనున్నాయి. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఉపయోగించాలని ఈసీ నిర్ణయించింది. అభ్యర్థులు, వారి అనుచరులు ఎవరైనా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకొంటామని ఈసీ హెచ్చరించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :