ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కృతి టైం చాలా బ్యాడ్

కృతి టైం చాలా బ్యాడ్

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న కృతి శెట్టి. వాస్త‌వానికి ఉప్పెన కోసం ముందు సెలెక్ట్ చేసిన హీరోయిన్ వేరు. కానీ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో తెలీదు స‌డెన్‌గా కృతి లైన్‌లోకి వ‌చ్చింది. సినిమా రిలీజ్‌కు లేట్ అయినా స‌రే రిలీజ్ తర్వాత మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. 

ఉప్పెన‌తో కృతికి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం, కృతికి కూడా ఈ సినిమాతో పేరు రావ‌డంతో అమ్మ‌డుకి మంచి ఆఫ‌ర్లే వ‌చ్చాయి. రెండో సినిమా నానితో శ్యామ్ సింగ‌రాయ్‌లో న‌టించి మరో హిట్‌ను అకౌంట్ లోకి వేసుకుంది కృతి. కానీ మూడో సినిమా బంగార్రాజు మాత్రం అంచ‌నాలను రీచ్ కాలేదు. 

ఆ త‌ర్వాత కృతి న‌టించిన మూడు సినిమాలు వ‌రుస‌గా డిజాస్ట‌ర్లుగా మిగిలాయి. ది వారియ‌ర్, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ సినిమాలు ఆమె కెరీర్‌ను పూర్తిగా ఢీలా ప‌డేలా చేశాయి. త‌ర్వాతి సినిమాల‌తో అయినా కృతి కెరీర్ గాడిలో ప‌డుతుందా అంటే అలాంటి సంకేతాలేమీ క‌నిపించ‌డం లేదు. 

త‌మిళంలో వ‌చ్చిన అవ‌కాశాలు కూడా కృతి చేజారిపోతున్నాయి. బాలా ద‌ర్శ‌క‌త్వంలో సూర్య సినిమాగా తెరకెక్క‌నున్న సినిమాలో కృతిని హీరోయిన్‌గా అనుకున్నారు కానీ ఆ సినిమా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. అరుణ్ విజ‌య్‌తో కృతిని ఓ సినిమా కోసం తీసుకున్నారు. కానీ ఏం జ‌రిగిందో ఏమో, ఆ సినిమా నుంచి కృతిని త‌ప్పించి మ‌రో హీరోయిన్‌ను ఫైన‌ల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కృతి ఆశ‌ల‌న్నీ చైతూతో న‌టిస్తున్న క‌స్ట‌డీ మీదే ఉన్నాయి. ఈ సినిమా కూడా తేడా కొడితే కృతి కెరీర్ క‌ష్ట‌మనే చెప్పాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :