ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కోట్లు కురిపించిన కోకాపేట.. ఎకరం 100 కోట్లు

కోట్లు కురిపించిన కోకాపేట.. ఎకరం 100 కోట్లు

హైదరాబాద్‌ విశ్వనగరంగా ఖ్యాతి చెందడంతో భూముల ధరలు అంతే స్థాయిలో అమ్ముడు పోతున్నాయి. దేశంలోనే రికార్డు స్థాయిని సృష్టిస్తున్నాయి. భారత చరిత్రలో రెండో అత్యధిక ధర ఎకరానికి రూ.100 కోట్ల మార్క్‌ను దాటి అమ్ముడయ్యాయి. ప్రపంచానికే ఐటీ అడ్డాగా మారుతున్న హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో నిర్వహించిన కోకాపేట భూముల వేలం ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించింది. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన నియో పోలీస్‌ ఫేజ్‌-2 వేలంలో భూములకు భారీ డిమాండ్‌ కన్పించింది. ఒక్క 10వ నెంబర్‌ ప్లాట్‌లో ఎకరం ధర రూ.100.75 కోట్లు పలికింది. హైదరాబాద్‌ చరిత్రలో ఇదే అత్యధిక ధరను నమోదు చేసింది. 3.60 ఎకరాల నుంచి 9.71 ఎకరాల వరకు ఒక్కో ప్లాట్‌ ఉంది. ఈ వేలంలో మొత్తం రూ.3319.60 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎకరానికి రూ.100.75 కోట్లు పలకగా, అతి తక్కువగా రూ.67.25 కోట్లకు రియల్టర్లు వేలం పాడారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :