ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసీఆర్.. కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదు

కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసీఆర్.. కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదు

తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్షసాధింపు ఎలా అవుతుందో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కేసులో తమ కుటుంబానికి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సంబంధం లేదని కేసీఆర్‌ చెప్పగలరా? మద్యం పాలసీలో ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం అవకతవకలు చేసింది. ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో దొరికింది.  కేజ్రీవాల్‌, కవిత అరెస్టును దేశమంతా సమర్థిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్‌తో చర్చకు మేం సిద్ధం. అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు.

కేజ్రీవాల్‌ తప్పు లేదని కేసీఆర్‌ నిరూపించగలరా? కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించిన కేసీఆర్‌, కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదు. కవిత అరెస్టు విషయంలో కేసీఆర్‌ మౌనానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం అవినీతిపై దమ్ముంటే సీఎం రేవంత్‌ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలి. తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని స్పష్టం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :