ASBL NSL Infratech

మదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్...

మదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్...

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. వీరి పెళ్లి జరిగి రెండేళ్ళు దాటితుంది. 2020లో ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ సినిమాలు అయితే ఇప్పటి వరకు చేయలేదు. గత ఏడాది కాజల్ అగర్వాల్ మగబిడ్డకి జన్మనిచ్చింది. తన కొడుకు పేరు "నీల్" అని పేరు పెట్టింది. కొడుకు పుట్టిన తర్వాత ఆమె సెలబ్రిటీ అనే బ్రాండ్ ని పక్కన పెట్టి మదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తుంది.

అయితే సోషల్ మీడియాలో కాజల్ ఎక్కువగా ఆక్టివ్ గా ఉండేది కాదు. ఈ మధ్య రెగ్యులర్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో కొడుకుతో ఆడుకుంటూ తీసుకున్న ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తల్లి ప్రేమని పంచుతూ, తనతో గడిపే సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది అనేది చెప్పకనే చెబుతుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా తన కొడుక్కి 9 నెలలు పూర్తయ్యాయనే విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ ఫోటో షేర్ చేస్తూ దానికి "భవిష్యత్తులో దేవుడు నీతో చేయించి అన్ని పనులు చూడటానికి ఈ క్షణం నుంచే వేచి ఉండలేను. నీతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆశ్వాదిస్తూ భగవంతుడుకి థాంక్స్ చెప్పుకుంటాను. తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలియజేసింది". కొడుకుతో కలిసి దిగిన ఈ ఫోటోకి కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :