ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ

డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇలినోయీ రాష్ట్రంలో ఈ నెల 19న జరిగే రిపబ్లికన్‌ పార్టీ ప్రైమరీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రం నుంచి ఆయన పేరును తొలగించాలని కుక్‌ కౌంటీ జడ్జి ట్రేసీ పోర్టర్‌ ఆదేశించారు. దీనిపై ట్రంప్‌ అప్పీలు చేసుకోవడానికి వీలుగా తన ఉత్తర్వు అమలును శుక్రవారం వరకు నిలిపి ఉంచుతున్నట్లు ప్రకటించారు. 2021 జనవరి 6న అమెరికా పార్లమెంటు భవనంపై దాడిని ప్రోత్సహించినందుకు ట్రంప్‌ పేరును బ్యాలట్‌ నుంచి తొలగించాలని అయిదుగురు ఓటర్లు కోర్టులో పిటిషన్‌ వేశారు. తిరుగుబాటును లేవ దీసినవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని నిర్దేశిస్తున్న 14వ రాజ్యాంగ అధికరణ ఆధారంగా అమెరికా అంతటా ట్రంప్‌పై దావాలు వేస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :