ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సొంత గోల్ఫ్ క్లబ్ లో అవార్డులు .. ట్రంప్ పై బైడెన్ విసుర్లు

సొంత గోల్ఫ్ క్లబ్ లో అవార్డులు .. ట్రంప్ పై బైడెన్ విసుర్లు

సొంత గోల్ప్‌ క్లబ్‌లో అవార్డులు సాధించానన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సరదాగా స్పందించారు. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ట్రంప్‌కు సొంత ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ఉంది. అందులో తాజాగా అవార్డుల గోల్ఫ్‌ ప్రదానం జరిగింది. తనకు ది క్లబ్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీ, ది సీనియర్‌ క్లబ్‌ మెంబర్‌షిప్‌ ట్రోఫీలు వచ్చాయంటూ సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌ లో ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. దీనిపై బైడెన్‌ వ్యంగ్యంగా స్పందించారు. అబ్బో ఎంతటి ఘనతో అభినందనలు అంటూ ఎక్స్‌లో ఆయన పెట్టిన పోస్ట్‌కు ఏకంగా 1.3 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. మీ అజమాయిషీలో లేని ఏదైనా  గోల్ప్‌ క్లబ్‌లో ట్రోఫీ గెల్చుకొస్తే చెప్పవయ్య ట్రంపూ అటూ మాజీ స్పోర్ట్స్‌ కాలమిస్ట్‌ రిక్‌ రేలీ కూడా చురకలు వేశారు. ట్రంప్‌కు ఇలాంటివి కొత్త కాదు. తనకు పలు అవార్డులు వచ్చాయని, పలు సంస్థలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రదానం చేశాయని గతంలోనూ పలుమార్లు చెప్పుకున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :