ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ నామినేషన్

డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ నామినేషన్

అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడనున్నారు. ఈ ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్‌ పార్టీ తరపున ఆయన నామినేషన్‌ ఖరారయింది. బహుశా ఆయన తుది పోరులో రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌తోనే అధ్యక్ష రేసులో పోటీపడే అవకాశం ఉందని తెలిసింది. అమెరికాలోని గడిచిన 70ఏళ్ల చరిత్రలో ఇద్దరు అభ్యర్థులు రెండోసారి మళ్లీ పోటీపడే అవకాశాలు ఉన్నాయి. డెమోక్రటిక్‌ పార్టీ తరపున బైడెన్‌ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు 1968 డెలిగేట్లను నెగ్గాల్సి ఉంటుంది. అయితే నామినేషన్‌కు కావాల్సిన సంఖ్యా బలాన్ని ఆయన దాటివేసినట్లు తెలిసింది. జార్జియా రాష్ట్రానికి చెందిన ప్రైమరీ ఎన్నికల ఫలితాలు వెలుబడడంతో బైడెన్‌ రూట్‌ క్లియర్‌ అయింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :