ASBL NSL Infratech

బాబోయ్.. జ‌గ్గూ భాయ్ ఇంత వ‌యలెంటా?

బాబోయ్.. జ‌గ్గూ భాయ్ ఇంత వ‌యలెంటా?

టాలీవుడ్ లో ఇప్పుడు తెలంగాణ ప్రాంత క‌థ‌ల‌తో ఇక్క‌డి నేప‌థ్యంలో తెర‌కెక్కే సినిమాలు బాగా పెరిగాయి. రీసెంట్‌గా వ‌చ్చిన బ‌ల‌గం పూర్తిగా తెలంగాణ మ‌ట్టి క‌థ‌తో తెర‌కెక్కింది. ద‌స‌రా కూడా తెలంగాణ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమానే. దీంతో పాటు తెలంగాణ చ‌రిత్ర‌ను తెలియ‌చెప్పే క‌థ‌లు కూడా రూపొందుతున్నాయి. 

వీటితో పాటూ తెలంగాణ చ‌రిత్రను తెలియ‌చేసే క‌థ‌లు కూడా రూపొందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రుద్రంగి కొత్త సినిమా కూడా తెర‌పైకి వ‌చ్చింది. తెలంగాణ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ నిర్మించిన సినిమా ఇది. అజ‌య్ సామ్రాట్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కొంచెం పెద్ద బ‌డ్జెట్‌లోనే పీరియ‌డ్ సినిమాగా రుద్రంగిని రూపొందించారు.

తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను లాంచ్ చేశారు. ఇందులో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది జ‌గ‌ప‌తిబాబు చేసిన విల‌న్ క్యారెక్ట‌రే. ఆయ‌న కెరీర్లో ఎప్పుడూ చేయ‌ని వయ‌లెంట్ రోల్ జ‌గ‌ప‌తిబాబు ఇందులో చేసిన‌ట్ల‌నిపిస్తుంది. ఇండియాకు స్వాతంత్య్రం వ‌చ్చాక కొన్నేళ్ల పాటూ తెలంగాణ‌లోని కొన్ని సంస్థానాలు దొర‌ల పాల‌న‌లోనే ఉన్న స‌మ‌యంలో న‌డిచిన క‌థ‌గా ఇది తెలుస్తోంది. స్వాతంత్య్రం బానిస‌ల‌కు ఉందంటూ త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వారిని తీవ్రంగా హింసించే దొర‌పాత్ర‌లో జ‌గ‌పతిబాబు క‌నిపించారు.

టీజ‌ర్ చూస్తుంటేనే జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న భ‌య‌పెట్టేస్తోంది. ఒక విచిత్ర‌మైన ఎక్స్‌ప్రెష‌న్‌తో క్రూర‌త్వాన్ని పండించే ప్ర‌య‌త్నం చేశారాయ‌న. దొర‌కు ఎదురు తిరిగి, బానిస‌త్వ‌పు సంకెళ్లు తెంచ‌డానికి ప్ర‌య‌త్నించే విప్ల‌ప‌కారుడి పాత్ర‌లో ఆశిష్ గాంధీ న‌టించాడు. మే 26న రుద్రంగి ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :