ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా నుంచి విమర్శలు.. వెనక్కి తగ్గిన భారత్

అమెరికా నుంచి విమర్శలు.. వెనక్కి తగ్గిన భారత్

పరిశ్రమ వర్గాలతో పాటు అమెరికా నుంచి విమర్శలు రావడంతో ల్యాప్‌టాప్‌ దిగుమతులపై ఆంక్షలు విధించాలనే ప్రతిపాదనపై భారత్‌ వెనక్కి తగ్గింది. ల్యాప్‌టాప్‌ దిగుమతులపై భారత్‌ ఆంక్షలు విధించదని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ భర్త్‌వల్‌ వెల్లడించారు. దిగుమతిదారులు  ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనించాలని మాత్రమే ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. భారత్‌లో విశ్వనీయత కలిగిన హార్డ్‌వేర్‌, సిస్టమ్స్‌ ప్రవేశించాలనే లక్ష్యంతో ఆగస్ట్‌ 3న ప్రకటించిన దిగుమతి లైసెన్సింగ్‌ విధానం పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు ఎదురువడంతో మూడు నెలల ఆలస్యమైంది. ప్రభుత్వ ప్రతిపాదన డెల్‌, యాపిల్‌, శాంసంగ్‌, లెనోవా వంటి కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని, ల్యాప్‌టాప్‌ దిగుమతులపై అక్టోబర్‌ మాసాంతానికి నూతన ఉత్తర్వులు వెలువడతాయని విదేశీ వర్తక డైరెక్టరేట్‌ జనరల్‌ సంతోష్‌ కుమార్‌ సారంగి పేర్కొంది. నూతన ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :