ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కెనడా అధ్యక్షుడు ట్రూడోకు షాక్..

కెనడా అధ్యక్షుడు ట్రూడోకు షాక్..

భారత వ్యతిరేక విధానంతో ముందుకెళ్తున్న కెనడా సర్కార్ కు.. సొంత దర్యాప్తు సంస్థలే షాకిచ్చాయి. ఆ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పాయి. దీనికి సంబంధించి దర్యాప్తు నివేదికను ప్రభుత్వానికి సమర్పించాయి. దీంతో అధ్యక్షుడు ట్రూడోకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇటీవలి కాలంలో చాలా సార్లు ట్రూడో భారత్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తమ దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు భారత్, పాకిస్తాన్ ప్రయత్నించాయని ట్రూడో ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలంటూ దర్యాప్తు సంస్థల్ని ఆదేశించారు ట్రూడో.

అయితే... ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం మా విధానం కాదని కెనడా తీరును భారత్‌ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలపై కమిషన్‌ ఓ నివేదికను సమర్పించింది. ఎన్నికల్లో భారత్‌ ప్రమేయం లేదని అందులో స్పష్టం చేసింది. 2019-21 ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందని కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (సీఎస్‌ఐఎస్‌) నివేదిక వెల్లడించింది.

ఖలిస్తాన్ ఫోర్స్ కు సంబంధించిన పన్ను హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలతో వివాదం మొదలైంది. దీనివెనక భారత్ హస్తముందని కెనడా అధ్యక్షుడు ట్రూడ్.. పలుమార్లు ఆరోపించారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన ఆధారాలున్నాయన్నారు. అయితే...ఆ ఆధారాలను సమర్పించాలని భారత్ పలుమార్లు కోరింది.కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలను ట్రూడో సర్కార్ .. భారత్ కు అందించలేదు. దీంతో ఈ ఆరోపణలను భారత్ పట్టించుకోవడం మానేసిందని చెప్పొచ్చు.అయితే ఇదే సమయంలో .. అమెరికాకు మాత్రం విచారణలో సహకరిస్తామని తెలిపింది.

మరోవైపు..కెనడా ప్రధానికి విపక్షాల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ముందస్తు ఆలోచనలు లేకుండా ప్రపంచంలోని అతిపెద్దప్రజాస్వామ్య దేశంపై విమర్శలేంటని అక్కడి విపక్షాలు సైతం తప్పుపడుతున్నాయి. అయితే కెనడాలో అతిపెద్ద ఓటు బ్యాంకు అయిన ఖలిస్తానీ సానుభూతి పరుల ఓట్లతో గెలవొచ్చని ట్రూడో సర్కార్ భావిస్తోంది. దీంతో భారత్ తో వివాదాన్ని కొనసాగిస్తూ వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :