ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క‌ళ్ళు చెదిరేలా క‌ల్కి బిజినెస్

క‌ళ్ళు చెదిరేలా క‌ల్కి బిజినెస్

బాహుబ‌లి త‌ర్వాత ప్రభాస్ నుంచి వ‌చ్చిన సినిమాలన్నీ డిజాస్ట‌ర్లైన‌ప్ప‌టికీ అతని మార్కెట్, క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ చేసిన స‌లార్ సినిమాకు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. బాహుబ‌లిని మించిన బిజినెస్ ఆఫర్ల‌ను కూడా స‌లార్ ద‌క్కించుకుంది. స‌లార్ తెలుగు రాష్ట్రాల హ‌క్కులు రూ.165 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ప్ప‌టికీ, ఆ భారీ మొత్తాన్ని రిక‌వ‌ర్ చేసి కూడా లాభాలు తెచ్చిపెట్టింది ఆ సినిమా.

ఇప్పుడు ప్ర‌భాస్ న‌టిస్తున్న కొత్త సినిమా క‌ల్కి స‌లార్ ను మించి బిజినెస్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. క‌ల్కి తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఏకంగా రూ.190 కోట్లు చేసిందట‌. ఇప్ప‌టికే అన్ని ఏరియాల‌కు సంబంధించిన బిజినెస్ క్లోజ్ అయిన‌ట్లు స‌మాచారం. క‌ల్కి నైజాం రైట్స్ రూ.75 కోట్లు ప‌ల‌క‌గా, సీడెడ్ రూ.30 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ.80-90 కోట్ల మ‌ధ్య ఉన్నాయ‌ట‌.

ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలోనే భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు హైప్ ఓ రేంజ్ లో ఉంది. ఫాంట‌సీ ట‌చ్ ఉన్న సై ఫై థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాసన్, దీపికా ప‌దుకొణె, దిశా ప‌టానీలు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మొద‌ట్లో ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ ఇప్పుడు ఎల‌క్ష‌న్స్ నేపథ్యంలో సినిమాను జూన్ కు వాయిదా వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :