జో బైడెన్ కుటుంబంపై విచారణకు అత్యధిక ప్రాధాన్యం : రిపబ్లికన్ లు

జో బైడెన్ కుటుంబంపై విచారణకు అత్యధిక  ప్రాధాన్యం : రిపబ్లికన్ లు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలో ఆధిక్యాన్ని సాధించిన రిపబ్లికన్లు అధ్యక్షుడు జో బైడెన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. బైడెన్‌ కుటుంబంపై విచారణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ విదేశీ వ్యాపారాలపై దర్యాప్తును ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. కుమారుడి వ్యాపారాలను బలోపేతం చేయడంలో అధ్యక్షుడి పాత్ర ఉందని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హౌస్‌ పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న జేమ్స్‌ కోమర్‌ హెచ్చరించారు. హంటర్‌ వ్యాపారాలపై ఇప్పటికే ఎఫ్‌బీఐ దర్యాప్తు నిర్వహిస్తోంది. పన్నుల ఎగవేత, ఆర్థిక మోసాలు చేసినట్టుగా విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా కుమారుడి వ్యాపారాలను విస్తరించడానికి తన అధికారాలను ఉపపయోగించారని ఆరోపణలున్నాయి.

 

Tags :