ASBL NSL Infratech

గూగుల్ మరోసారి లేఆఫ్స్.. 1000 మందిపై వేటు

గూగుల్ మరోసారి లేఆఫ్స్.. 1000 మందిపై వేటు

టెక్‌ దిగ్గజం గూగుల్‌ మరో దశ లేఆఫ్స్‌కు తెగబడిరది. లేటెస్ట్‌ లేఆఫ్స్‌లో భాగంగా సెర్చింజన్‌ దిగ్గజం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. గూగుల్‌ హార్డ్‌వేర్‌, సెంట్రల్‌ ఇంజనీరింగ్‌ టీమ్‌లు, గూగుల్‌ అసిస్టెంట్‌ సహా పలు విభాగాల్లో కంపెనీ కొలువుల కోతకు పాల్పడింది. లేఆఫ్స్‌ గురించి ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నామని, సంక్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బాధిత ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌లో కంపెనీ పేర్కొంది. అర్హులైన ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్‌ వర్తింపచేస్తామని గూగుల్‌ స్పష్టం చేసింది. ఇతర విభాగాల్లో ఎంపిక చేసిన అవకాశాలకు వేటుకు గురైన ఉద్యోగులు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కంపెనీలో తిరిగి అవకాశం దక్కని ఉద్యోగులు ఏప్రిల్‌లో కంపెనీని వీడాలని తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :