ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు...?

ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు...?

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థిరేసులో తుది అంకానికి చేరారు. అన్ని ప్రైమరీల్లోనూ ట్రంప్ స్పష్టమైన మెజార్టీ కనబరుస్తున్నారు. తాజాగా జరిగిన మిస్సోరి, మిచిగన్‌, ఐదహొ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ట్రంప్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. మంగళవారం జరిగే ‘సూపర్‌ ట్యూస్‌డే’ లో డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ మద్దతుదారులు అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు.

సూపర్‌ ట్యూస్‌డే?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌, రిపబ్లికన్ పార్టీల తరఫున పోటీపడే అభ్యర్థిని ఎన్నుకునేందుకు నిర్వహించే ఓటింగ్‌ ప్రక్రియ. ఈ రోజు అన్ని రాష్ట్రాల్లోని పార్టీల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొంటారు. రిపబ్లికన్‌ పార్టీకి మొత్తం 2,429 మంది ప్రతినిధులు ఉండగా.. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడే వ్యక్తికి 1,215 మంది మద్దతు అవసరం. ఇక, డెమోక్రటిక్‌ పార్టీకి 3,979 మంది ఉన్నారు. వీరిలో 1,439 మంది మద్దతును అధ్యక్ష అభ్యర్థిత్వం పోటీ పడే వ్యక్తికి లభించాలి.

ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌నకు 244 మంది ప్రతినిధుల మద్దతు లభించగా.. మరో పోటీదారు నిక్కీ హేలీకి కేవలం 24 మంది మద్దతు తెలిపారు. మంగళవారం జరిగే ఓటింగ్‌లో ట్రంప్‌నకు 874 ఓట్లు అవసరం. మరోవైపు డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ దక్షిణ కరోలినాలో 95 శాతం, మిచిగన్‌లో 80 శాతం ఓట్లు గెలుపొందినట్లు స?ఇమాచారం.

అయితే న్యాయస్థానాల్లో ఆయనపై ఉన్న అవినీతి కేసులపై విచారణలో ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపైనే ట్రంప్ అభ్యర్థిత్వం ఆధారపడి ఉంది. మొన్నటివరకూ ట్రంప్ ఒక్కరే..తనపై ఉన్న కేసుల్లో పోరాడుతూ వచ్చారు. ఇప్పుడు అభ్యర్థిగా కనుక ఎంపికైతే, ట్రంప్ కు పార్టీ బలం కూడా తోడవుతుంది. కానీ.. ఈ కేసులు ఉన్న నేపథ్యంలో పార్టీ సభ్యులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :