ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కృతి, శ్రీ లీల మ‌ధ్య తేడా అదే!

కృతి, శ్రీ లీల మ‌ధ్య తేడా అదే!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి, మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని అందుకోవ‌డంతో పాటు, కుర్రాళ్ల మ‌నసుల‌ను దోచుకుంది కృతి శెట్టి. దీంతో కృతికి వ‌రుస‌పెట్టి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ వ‌దులుకోకుండా చేసి, త‌న కెరీర్‌ను రిస్క్ లో ప‌డేలా చేసుకుంది. ప్ర‌స్తుతం కృతి చేతిలో నాగ‌చైత‌న్య‌- వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌స్ట‌డీ సినిమా ఒక్క‌టే ఉంది. 

స‌డ‌న్ గా కృతికి ఇలా ఆఫ‌ర్లు త‌గ్గ‌డానికి కృతి చేసిన త‌ప్పులు కొంత‌వ‌ర‌కు కార‌ణ‌మైతే, హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల మ‌రో కార‌ణ‌మంటున్నారు. ఉప్పెన హిట్ అవ‌గానే ఐదారు సినిమాలను ఓకే చేసిన కృతి, అందులో కథేంటి? త‌న పాత్రేంటి? అనేది చూసుకోకుండా ఒప్పేసుకుంది. నానితో చేసిన శ్యామ సింగ‌రాయ్ హిట్టైనా, బంగార్రాజు ఓకే అనిపించినా, ఆ త‌ర్వాత త‌న నుంచి వ‌చ్చిన మూడు సినిమాలు ది వారియ‌ర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా మిగిలాయి. 

ఇదిలా ఉంటే శ్రీ లీల మాత్రం పెళ్లి సెంద‌డితో త‌న టాలెంట్ చూపించి, ధ‌మాకాతో సూప‌ర్ హిట్ అందుకుని, ఇప్పుడు క్రేజీగా ఆఫ‌ర్లు కొట్టేస్తుంది. అయితే ఇక్క‌డే శ్రీలీల‌కు, కృతికి వ్య‌త్యాసం కన‌బ‌డుతుంది. సినిమా వ‌స్తే ఓకే అనేసిన కృతి లా కాకుండా, ఎంత పెద్ద ఆఫ‌ర్ అయినా స‌రే త‌న పాత్ర న‌చ్చి, అది వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని త‌న‌కు అనిపిస్తేనే సినిమా ఓకే చేస్తుంద‌ట శ్రీలీల‌.

వాస్త‌వానికి టీజే టిల్లు సీక్వెల్ గా వ‌స్తున్న టిల్లు స్క్వేర్‌లో ముందు శ్రీలీల‌నే హీరోయిన్ గా అనుకున్నారు కానీ సినిమా అంతా సిద్ధూ మీద‌నే ఎక్కువ ఫోకస్ అవుతుంద‌ని భావించి, ఈ ప్రాజెక్ట్‌ను వ‌ద్ద‌నుకుంద‌ట శ్రీలీల‌. త‌న క్యారెక్ట‌ర్ సినిమాలో ఏ మేర‌కు ఉంది అనేది చూసి, చాలా సెలెక్టెడ్ గా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది ఈ భామ‌. ప్ర‌స్తుతం శ్రీ లీల చేతిలో దాదాపు 10 ప్రాజెక్టులున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :