ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క్షమాపణలు తెలిపిన అమెరికా రక్షణ మంత్రి

క్షమాపణలు తెలిపిన అమెరికా రక్షణ మంత్రి

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇటీవల రహస్యంగా ఐసీయూలో చేరి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు చికిత్స తీసుకోవడంపై ఆ దేశ చట్టసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరిక గురించి దేశాధ్యక్షుడికి సైతం సమాచారం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మైక్‌ రోజర్స్‌ నేతృత్వంలోని చట్టసభ్యుల కమిటీ ముందు ఆస్టిన్‌ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అటు డెమోక్రాట్‌, ఇటు రిపబ్లికన్‌ నేతలు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌`రష్యా, ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధాలతో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించడమేంటని నిలదీశారు. దీంతో కమిటీ ఎదుట ఆస్టిన్‌ క్షమాపణలు తెలియజేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :