ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప‌వ‌న్, సుజిత్ సినిమా వార్త‌ల‌న్నీ పుకార్లే

ప‌వ‌న్, సుజిత్ సినిమా వార్త‌ల‌న్నీ పుకార్లే

ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్‌తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌తో పాటూ, క్రిష్‌తో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమా మిగిలిన షూటింగ్ పూర్తి కావ‌డానికి ఇంకా ప‌ట్టనుండ‌టంతో ప్ర‌స్తుతం భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ ఒక్క‌టే ప‌వ‌న్ చేస్తున్నాడు. ఇది కాకుండా వినోదాయ సీతం రీమేక్ చేయ‌డానికి కూడా ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కాక‌పోతే ఫైన‌ల్ స్క్రిప్ట్ రెడీ కాక‌పోవ‌డంతో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి చాలానే టైమ్ ప‌ట్టే అవ‌కాశ‌ముంది. ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్న స‌ముద్రఖ‌ని కూడా త‌ను న‌టించ‌నున్న సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

అయితే ఈ గ్యాప్‌లో ఇప్పుడు ప‌వ‌న్ మ‌రో సినిమాలో న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప‌వ‌న్, సుజిత్ డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌నున్నాడ‌ని, డీవీవీ దాన‌య్య సినిమాను నిర్మించ‌నున్నాడ‌నేది ఆ వార్త‌ల సారాంశం. ఇవ‌న్నీ త‌ప్పుడు వార్త‌ల‌ని, త‌మ నుంచి ఏదైనా సినిమా రాబోతుంటే ఆ విష‌యాన్ని తామే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని, ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని డీవీవీ మూవీస్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :