ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సీఏఏ అమలు వెనక బీజేపీ వ్యూహం.?

సీఏఏ అమలు వెనక బీజేపీ వ్యూహం.?

పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడం, దానిపై అధికార విపక్షాలు... ఎవరి వాదన వారు వినిపిస్తున్నాయి. బీజేపీ.. ఈచట్టాన్ని పూర్తిస్థాయిలో సమర్థిస్తోంది. అంతేకాదు.. ఇది విదేశాల్లో అణచివేతకు గురవుతున్న ముస్లిమేతర మైనార్టీలకు.. ఆపన్నహస్తంగా చెబుతోంది. భారత పౌరసత్వాన్ని అందించేందుకు ఏర్పాట్లుచేసింది. షరతులంటే...గతానికి భిన్నంగా 2014కు ముందు ఇండియాకు వలసవచ్చి, ఇక్కడే పనిచేసుకుంటున్నవారికి.. అవకాశం కల్పిస్తోంది. చూసేందుకు ఇది కరక్టే కదా అన్న భావన తటస్థంగా ఉండే ఓటర్లు, ప్రజల్లో ఉంది.

2014 కు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భా‌రత్‌కు వచ్చిన ముస్లిమేతర పౌరులకు భారత పౌరసత్వం కల్పించడమే... ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన ఉద్దేశం. ఎవరైతే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనుల, బౌద్దులు, పార్శీలు.. 2014 కంటే ముందు భారత్‌కు వలస వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం కల్పించనున్నారు. గతంలో 1955 చట్టం ప్రకారం.. ఈ గడువు 11 ఏళ్లుగా ఉండేది. దాన్ని కుదించి.. ఇప్పుడు ఈ అవకాశం కల్పిస్తున్నారు.

ఈ చట్టం ప్రకారం కొంతమంది దేశ విభజన సమయంలో ఇండియా నుంచిపాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు తరలిపోయారు. అక్కడ హిందువులు, ఇతర మతస్తులగానే జీవనం సాగిస్తున్నారు. వీరిపై ఆదేశ అధికారులు, అతివాదులు.. అణచివేతకు దిగుతున్నారు. మతం మారాలని వత్తిడి తేవడం, ఆస్తుల కబ్జా, బలవంతంగా వారి అమ్మాయిలను ఎత్తుకుపోయి, వివాహం చేసుకోవడం.. దేవాలయాలను ధ్వంసం చేయడం లాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. అణచివేతకు గురవుతున్న వారికి కేంద్రం తీసుకొచ్చిన ఈ ఈపథకం అమలు.. ఓ వరప్రదాయనిగా చెప్పొచ్చు.

అయితే దీనివెనక మోడీ దూరదృష్టి కూడా ఉంది. వీరందరూ దేశంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా .... బీజేపీకి ఓటుబ్యాంకుగా మారతారన్న ఆలోచన కనిపిస్తోంది. దీంతో వీరందరినీ కొత్తగా తమ ఓటు బ్యాంకుగా చేసుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే.. అదేమీ లేదు.. వారందరికీ ఈదేశంలో ఉండే అవకాశం కల్పిస్తున్నామని చెబుతోంది బీజేపీ. దీనివల్ల అసోం, బెంగాల్ లాంటి చోట్ల స్థానిక సమీకరణాలు మారనున్నాయని చెప్పక తప్పదు.

2019 డిసెంబర్ 11 వ తేదీన ఈ పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందింది. దీనికి సంబంధించి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా సంతకం చేశారు. అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిబంధనలు, విధివిధానాలు మాత్రం ఇప్పటివరకు కేంద్రం రూపొందించలేదు. తాజాగా ఈ సీఏఏను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :