ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వైదొలగనున్న బోయింగ్ సీఈఓ

వైదొలగనున్న బోయింగ్ సీఈఓ

విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ( సీఈఓ) డేవ్‌ కాల్హౌన్‌ ఈ ఏడాది చివరికల్లా తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. బోయింగ్‌ విమానాల్లో పలు లోపాలు ఇటీవల వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. బోయింగ్‌ బోర్డు చైర్మన్‌ లారీ కెల్నర్‌ కూడా, మళ్లీ బోర్డు ఎన్నికలో నిలబడే ఆలోచన తనకు లేదని కంపెనీకి తెలియజేశారు. కంపెనీ వాణిజ్య విమానాల విభాగానికి ప్రెసిడెంట్‌, సీఈఓగా ఉన్న స్టాన్‌ డీల్‌ కూడా పదవీ విరమణ చేయనున్నారని, ఈ విభాగానికి స్టెఫనె పోప్‌ సారథ్యం వహిస్తారని బోయింగ్‌ తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :