ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డబ్బు కన్నా పేరు ముఖ్యం అంటున్న బిగ్ బాస్ 6 విన్నర్...

డబ్బు కన్నా పేరు ముఖ్యం అంటున్న బిగ్ బాస్ 6 విన్నర్...

ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే చర్చ నడుస్తుంది. సీజన్ 6 టైటిల్ విన్నర్ గా  సింగర్ రేవంత్ నిలిచాడు. ఇప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. తనకు డబ్బు కన్నా టైటిల్ ముఖ్యం అంటూ ఈ విన్నర్ ఆసక్తిగా మాట్లాడాడు. మనీ కన్నా ఫేమ్ ఇంపార్టెంట్ , అందుకే నాగార్జున గారు ఇచ్చిన గోల్డ్ బాక్స్ ఆఫర్ ని కాదన్నానని అన్నాడు రేవంత్.

బిగ్ బాస్ ఫైనల్స్ లో  2 వ ప్లేస్ లో శ్రీహాన్ ఉన్న విషయం తెలిసిందే. రేవంత్, శ్రీహాన్ లలో ఒకరు మాత్రమే విన్నర్ అవుతారని చెప్పిహోస్ట్ నాగార్జున గోల్డ్ బాక్స్ ఆఫర్ ని ఆఫర్ చేసారు. అయితే ఆ ఆఫర్ కి రేవంత్ ససేమీరా ఒప్పుకోలేదు. 40 లక్షల కన్నా తనకు టైటిల్ గొప్ప అన్నాడు.

ఈ తరహాలోనే శ్రీహాన్ కి కూడా నాగ్ గోల్డ్ బాక్స్ ని ఆఫర్ చేసారు. శ్రీహాన్ ముందు నో చెప్పినా పేరెంట్స్ ఇంకా బయటకు వచ్చిన మిగతా హౌస్ మెట్స్ అంతా విన్నింగ్ ఛాన్సెస్ రేవంత్చె కె ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో గోల్డ్ బాక్స్ ని తీసుకుని 40  లక్షలు గెలుచుకున్నాడు. శ్రీహాన్ ఎలాగు గోల్డ్ బాక్స్ తో వచ్చాడు కాబట్టి టైటిల్ రేవంత్ సొంతమైంది. అయితే ఇదంతా బాగానే ఉండగా అసలు ఓటింగ్స్ ప్రకారం ఎవరు టాప్ లో ఉన్నారో తెలుసా అని నాగార్జున ఓ ట్విస్ట్ ఇచ్చారు.

అందరికన్నా శ్రీహాన్ కి ఎక్కువ ఓటింగ్ వచ్చాయని చెప్పారు. దానితో ప్రేక్షకులు తనని గెలిపించారని శ్రీహాన్ సంతోషపడ్డాడు. ఈ ఇష్యూపై రేవంత్ ఒకే ఒక్క మాట అన్నాడు. తనకు డబ్బు కన్నా టైటిల్ ఇంపార్టెంట్.. శ్రీహాన్ 40 లక్షలు అనగానే మాట మార్చేశాడు. కానీ తాను అలా కాదని అన్నారు. తనకు పేరు కావాలని అది ఉంటే డబ్బు ఆటోమెటిక్ గా వచ్చేస్తుందని అన్నారు రేవంత్. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :