ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు ...1962 తర్వాత ఈ స్థాయిలో

జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు ...1962 తర్వాత ఈ స్థాయిలో

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణు హెచ్చరికలు జోక్‌ కాదని, న్యూక్లియర్‌ బాంబులు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అమెరికా అద్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. మాన్‌హట్టన్‌లో నిర్వహించిన డెమొక్రాటిక్‌ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్‌ మాట్లాడుతూ 1962 లో క్యూబా మిసైల్‌ సంక్షోభం తర్వాత తాము ఈ స్థాయి తీవ్రమైన అణు ముప్పును చూడలేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే లక్ష్యం కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేస్తున్న అణు బెదిరింపులు ఏమాత్రం జోక్‌ కాదని అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్యూబా మిసైల్‌ సంక్షోభం తర్వాత తొలిసారి అమెరికా ప్రత్యక్షంగా అణుదాడి ముప్పును ఎదుర్కొంటుంటుందని బైడెన్‌ పేర్కొన్నారు. అణుదాడిపై బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :