ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అవతార్ 2 కలెక్షన్స్ టార్గెట్ రీచ్ అవుతుందా...

అవతార్ 2 కలెక్షన్స్ టార్గెట్ రీచ్ అవుతుందా...

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి "అవతార్ ది వే ఆఫ్ వాటర్" సినిమా థియేటర్లలో రిలీజై సంచలనాలు సృష్టిస్తుంది. సినిమా నిడివి కొద్దిగా ఎక్కువ అనిపించినా సినిమాని చూసిన ఆడియన్స్ అంతా కూడా సూపర్ అనేస్తున్నారు. ముఖ్యంగా త్రీడీ వర్షన్ లో ఈ సినిమా మరింత ఆసక్తిగా ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు. అవతార్ తర్వాత 13 ఏళ్లగా అవతార్ 2 మీద కాన్సన్ట్రేట్ చేసారు జేమ్స్.

ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 కలెక్షన్ల పరంగా దూకుడు చూపిస్తుంది. ఫస్ట్ డేనే 160 మిలియన్ డాలర్స్ వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇక 2 , 3 రోజుల్లో అవతార్ 434 మిలియన్ డాలర్స్ రీచ్ అయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాని 3 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. అదే స్థాయిలో బిజినెస్ కూడా జరిగింది. ఊహించని విధంగా 2 బిలియన్ డాలర్ల బిజినెస్ జరిగిందట. ఈ విషయాన్ని జేమ్స్ కామెరూన్ స్వయంగా చెప్పాడు.

మన లెక్కల్లో 16 వేల కోట్లని ఈ సినిమా వసూలు చేయాలి. ఒక్క వీకెండ్ 400 మిలియన్ డాలర్లు తెచ్చి పెట్టింది. మహా ఐతే 500 మిలియన్ డాలర్లు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కానీ, ముందుగా అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే మాత్రం నెల రోజుల పాటు ఇదే దూకుడు అవతార్ 2 కొనసాగించాలి. అసలు ఫుల్ రన్ లో 1.5 బిలియన్ డాలర్లు అయినా తెస్తుందా అని డౌట్ పడుతున్నారు సినీ వర్గాలు.

ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అవతార్ 2 ప్రభంజనాలు సృష్టిస్తుంది. మొదటి రోజు 35 కోట్ల గ్రాస్ తో సంచలనం అనిపించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అవతార్ మీద ఉన్న క్రేజ్ ఎలాంటిది అన్నది ఈ సినిమా కలెక్షన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. ఇండియా వైడ్ గా కూడా అవతార్ 2 వసూళ్లు అదరగొడుతున్నాయి. అవతార్ 2 అనుకున్న విధంగా అనుకున్న టార్గెట్ రీచ్ అయితేనే అవతార్ 4 5 తీస్తానని అన్నారు జేమ్స్ కామెరూన్. మరి అవతార్ 2 టార్గెట్ ని రీచ్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :