ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రశాంత్ కిశోర్ ఏ ఎండకాగొడుగు పడ్తారా..?

ప్రశాంత్ కిశోర్ ఏ ఎండకాగొడుగు పడ్తారా..?

ప్రశాంత్ కిశోర్ పేరు దాదాపు పదేళ్లుగా బాగా వినిపిస్తూనే ఉంది. దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ప్రశాంత్ కిశోర్ పాత్ర ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఆ ఎన్నికపై ప్రశాంత్ కిశోర్ ఏం చెప్తారో తెలుసుకునేందుకు జనం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గతంలో లగడపాటి రాజగోపాల్ సర్వేలకోసం జనం అదే స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ ఆ పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ప్రశాంత్ కిశోర్ సర్వేలు చేయరు. క్యాస్ట్ ఈక్వేషన్లు, అభివృద్ధి, సంక్షేమం, క్షేత్రస్థాయి పరిస్థితులు లాంటి వాటిని ఆధారంగా చేసుకుని ఒక అంచనాకు వస్తారు. తన మనసులో మాట చెప్తారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ పై ప్రశాంత్ కిశోర్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. 2019 వరకూ జగన్ వెంట నడిచి ఆయన్ను అధికారంలోకి తీసుకొచ్చారు ప్రశాంత్ కిశోర్. జగన్ ఈ ఐదేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పనుల వెనుక ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీలు ఉన్నాయి. ఆయన అమలు చేస్తున్న నవరత్నాలు పీకే చలవే. అధికారంలకి వచ్చేందుకు కులాల ఈక్వేషన్లు తెచ్చింది.. కులాల మధ్య చిచ్చు రేపింది పీకే సూచనలే.! 54 బీసీ కులాలకు కార్పొరేషన్లు పెట్టి వాళ్లను విడగొట్టేలా చేశారు. కులాలు, వృత్తుల వారీగా విభజించి వాళ్ల అకౌంట్లలోకి డబ్బులు వేసేలా చేశారు. కోడి కత్తి వెనుక కూడా పీకే స్ట్రాటజీ ఉందని చెప్తుంటారు. మొత్తానికి స్ట్రాటజీలు వర్కవుట్ అయ్యాయి. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. గెలిచిన వెంటనే జగన్ మొదట కౌగలించుకున్నది ప్రశాంత్ కిశోర్ నే..!

కానీ ఇప్పుడు జగన్ కు ప్రశాంత్ కిశోర్ పూర్తిగా దూరమయ్యారు. వాళ్ల మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందో తెలీదు. పీకే స్థాపించిన ఐప్యాక్ మాత్రం జగన్ కు సలహాలిస్తోంది.. కానీ పీకే మాత్రం అందులో లేరు. పైగా జగన్ పనితీరును విమర్శిస్తున్నారు. తాను చెప్పిన సలహాలు, సూచనలే జగన్ అమలు చేస్తున్నప్పుడు ఆయనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారనేది అర్థం కాని విషయం. ఆ మధ్య ప్రశాంత్ కిశోర్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. పార్టీలు గెలిచేందుకు తాను సలహాలు ఇవ్వనని.. గెలిచే పార్టీలను ఎంచుకుని వాటికి పనిచేస్తుంటానని చెప్పారు. బహుశా ఇప్పుడు ఏపీలో టీడీపీ గెలుస్తుందనే అంచనాకు వచ్చిన ప్రశాంత్ కిశోర్.. ఆ పార్టీకి అనుకూలంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారని భావించవచ్చు.

వ్యూహకర్తలు డబ్బులకోసం పని చేస్తుంటారు. రాష్ట్రం, దాని ప్రయోజనాలు వారికి పట్టవు. ఎలాగైనా తాము పనిచేస్తున్న పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుంటారు. అప్పుడు ప్రశాంత్ కిశోర్ కూడా వైసీపీకి అలాగే పనిచేశారు. కానీ ఇప్పుడు అదే పీకే పూర్తిగా ప్లేట్ ఫిరాయించేశాడు. చంద్రబాబును, లోకేశ్ ను కలవడం.. వాళ్లతో రహస్యంగా చర్చించిన తర్వాత పీకే ఈ స్టేట్ మెంట్లు ఇవ్వడంతో వాళ్లకోసం పీకే పని చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. అయినా డబ్బులకోసం పనిచేసే వాళ్లు ఏ ఎండకాగొడుగు పడ్తారనే విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ ను కూడా అలాగే అనుకోవచ్చేమో..!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :