ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బీజేపీకి దగ్గరవుతున్న జేడీఎస్..! లోక్‌సభ ఎన్నికలకు కలిసే పోటీ!!

బీజేపీకి దగ్గరవుతున్న జేడీఎస్..! లోక్‌సభ ఎన్నికలకు కలిసే పోటీ!!

ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కోల్పోయింది. ఇక జేడీఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎప్పడూ లేని విధంగా అత్యంత తక్కువ సీట్లు తెచ్చుకుంది. పార్టీ పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ రావడంతో మరో ఐదేళ్లపాటు కర్నాటకలో అధికారం దక్కే అవకాశం రెండు పార్టీలకూ లేదు. అందుకే రెండూ కలిసి లోక్ సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాయి. కేంద్రంలో అధికారం దక్కినా కాస్త బాగుంటుందని ఆలోచిస్తన్నాయి.

కర్నాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. కర్నాటక ప్రజలు తీవ్రంగా ఆ పార్టీని వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా తమ పార్టీ హవా కొనసాగుతోందని, కర్నాటకలో అదే రిపీట్ అవుతుందని బీజేపీ భావించింది. అన్ని రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా ప్రజలు తమకు మళ్లీ పట్టం కడతారని ఆశించింది. అయితే కర్నాటక ప్రజలు మాత్రం మరోలా ఆలోచించారు. దీంతో ఓటమి తప్పలేదు. లోక్ సభ ఎన్నికల ముందు ఇలాంటి ఓటమిని బీజేపీ ఏమాత్రం ఊహించలేదు. కర్నాటక ఎన్నికల ప్రభావం ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న ఇతర రాష్ట్రాలపైన కూడా పడుతోంది. అందుకోసం నష్టనివారణ చర్యలకు దిగింది బీజేపీ హైకమాండ్. జేడీఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది.

ఇక కర్నాటకలో ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్ గత రెండు దశాబ్దాలుగా కింగ్ మేకర్ పాత్ర పోషిస్తోంది. ఇదే ఆ పార్టీకి రెండు సార్లు అధికారంలోకి తీసుకురాగలిగింది. కాంగ్రెస్, బీజేపీలతో అవసరమైనప్పుడు స్నేహం చేయడం, లేనప్పుడు వదులుకోవడం జేడీఎస్ కు అలవాటే. ఇప్పుడు కూడా బీజేపీ, కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ రాదని, తాము కింగ్ మేకర్ కావడం ఖాయమని కుమారస్వామి కలలుగన్నారు. అయేత కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ రావడం, తమ పార్టీ గతంలో ఎన్నడూ లేనివిధంగా 19 సీట్ల దగ్గరే ఆగిపోవడం వాళ్లకు అస్సలు జీర్ణం కాని విషయం. రాష్ట్రంలో ఇప్పట్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వెళ్తే ప్రయోజనం ఉంటుందని జేడీఎస్ అధిష్టానం ఆలోచిస్తోంది.

వచ్చే లోక్ సభ ఎన్నికలకు కలిసే పోటీ చేద్దామమని బీజేపీకి జేడీఎస్ ప్రతిపాదించింది. అయితే తమకు 4 లోక్ సభ స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతోంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ చేయొచ్చని సూచించింది. వాస్తవానికి దక్షిణ కర్నాటకలో మాత్రం జేడీఎస్ ప్రభావం ఉంటుంది. అందుకే నాలుగు సీట్లు ఇచ్చినా సర్దుకు పోవాలని జేడీఎస్ భావిస్తోంది. ఇందుకు బీజేపీ అంగీకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ ను ఎవరికివాళ్లు ఒంటరిగా ఎదుర్కోవడం కంటే కలిసే ఎదుర్కొంటేనే బాగుంటుందని బీజేపీ కూడా భావిస్తున్నట్టు సమాచారం. అందుకే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ – జేడీఎస్ కూటమిగా బరిలోకి దిగేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :