ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏప్రిల్ సినిమాలన్నీ డిఫ‌రెంట్ జోనర్లే!

ఏప్రిల్ సినిమాలన్నీ డిఫ‌రెంట్ జోనర్లే!

ప్ర‌తి నెలా ఇండ‌స్ట్రీ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని హిట్, కొన్ని సూప‌ర్‌హిట్, మ‌రికొన్ని డిజాస్ట‌ర్‌లుగా మిగులుతాయి. సినిమా క‌థ ఎంతో బాగుంటే కానీ థియేట‌ర్ల‌లో సినిమాలు ఆడ‌ట్లేదు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ స్టోరీల‌పై ఆడియ‌న్స్ అస‌లు ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేదు. దీంతో ద‌ర్శ‌కులు కూడా కొత్త క‌థ‌ల‌ను చెప్ప‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తి నెలా డిఫ‌రెంట్ జోన‌ర్ల‌లో సినిమాలు ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌స్తున్నాయి. అస‌లు విష‌యానికి వ‌స్తే ఏప్రిల్ లో రిలీజ్ కాబోయే సినిమాల‌న్నీ డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలే కావ‌డం విశేషం. ఏప్రిల్ 7న రావ‌ణాసుర హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రానుంది. అదే రోజు కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్ మూవీ రిలీజ్ రాబోతుంది. అది అవుట్ అండ్ అవుట్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రానుంది. 

ఏప్రిల్ 14న స‌మంత న‌టించిన శాకుంత‌లం మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అదే రోజు డ‌బ్బింగ్ మూవీలు రుద్రుడు యాక్షన్ థ్రిల్ల‌ర్ గా, విజ‌య్ ఆంటోనీ బిచ్చ‌గాడు2 డిఫ‌రెంట్ క‌థ‌తో ఆడియ‌న్స్ ను అల‌రించడానికి రెడీ అవుతున్నాయి. 

వీటితో పాటు ఏప్రిల్ 21న సాయి ధ‌ర‌మ్ తేజ్ విరూపాక్ష కంప్లీట్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో, ఏప్రిల్ 28న అఖిల్ ఏజెంట్ క‌మ‌ర్షిష‌ల్ స్పై థ్రిల్ల‌ర్ గా యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో, అదే రోజు మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్2 హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ప్రేక్ష‌కులను అల‌రించ‌బోతున్నాయి. మ‌రి వీటిలో ఏ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ‌గా అల‌రించి, ఏప్రిల్ విన్న‌ర్ గా నిలుస్తుందో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :