ASBL NSL Infratech

మరో రంగంలో అపర్ణ గ్రూపు

మరో రంగంలో అపర్ణ గ్రూపు

స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లో క్రియాశీలక సంస్థగా ఉన్న అపర్ణ గ్రూపు ఔషధ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగా అపర్ణ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను అపర్ణ గ్రూపులో ఒక డివిజన్‌గా ఏర్పాటు చేసింది. ఈ సంస్థ శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరంలో ఒక యూనిట్‌ కొనుగోలు చేసి, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా స్యూటికల్‌ ఇన్‌గ్రేడియంట్స్‌) డ్రగ్‌ ఇంటర్మీడియేట్లను తయారు చేస్తోంది. ఈ యూనిట్‌ను గత ఏడాది సెప్టెంబరులో అమెరికా  ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆడిట్‌ చేసింది. తాజాగా ఈ యూనిట్‌ను ఆమోదిస్తున్నట్లు (వీఏఐ-వాలంటరీ యాక్షన్‌ ఇండికేటెడ్‌) యుఎస్‌ఎఫ్‌డీఏ నుంచి సమాచారం అందినట్లు అపర్ణ గ్రూపు వెల్లడించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :