ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వాట్సప్ లో కొత్త ఫీచర్

వాట్సప్ లో కొత్త ఫీచర్

స్నేహితులు, కుటుంబ సభ్యులకు సుదీర్ఘ సందేశం పంపాలనుకున్నప్పుడు వాట్సప్‌ వాయిస్‌ మెసేజ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాంట్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. వాయిస్‌ నోట్‌ అందినప్పటికీ వివిధ కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో దాన్ని ప్లే చేసి వినలేవు. దానికి పరిష్కార మార్గంగా వాయిస్‌ నోట్‌ ట్రాన్‌క్రిప్షన్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్‌ సిద్ధం చేస్తున్నన్నట్లు వాబీటాఇన్ఫో వెల్లడించింది. దీనితో వాయిస్‌ మెసేజ్‌లను టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకోవచ్చు. ఫలితంగా నోట్‌ను వినకుండానే సందేశాన్ని చదివి రిఫ్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని వాట్సప్‌ ఇప్పటికే కొంతమంది ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్‌ వినియోగదారులు కూడా ఈ సదుపాయాన్ని పొందనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :