ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మ‌హేష్ త‌ర్వాత బ‌న్నీనే..

మ‌హేష్ త‌ర్వాత బ‌న్నీనే..

అల వైకుంఠ‌పురంలో సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్ర‌మ్ రెండున్న‌ర ఏళ్ల కంటే ఎక్కువ‌గా టైమ్‌పాస్ చేశాడు. వేరే ప్రాజెక్టుల‌కు వ‌ర్క్ చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న ద‌ర్శ‌కత్వంలో అయితే సినిమా వ‌చ్చింది లేదు. మూడేళ్ల త‌ర్వాత ఆయ‌న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మ‌హేష్‌తో ఆయ‌న చేయ‌బోయే సినిమా షూటింగ్ ఇంకా మొద‌ల‌వ‌క‌ముందే వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమా రిలీజ్ చేయబోతున్నామంటూ అనౌన్స్ కూడా చేసేశారు. మ‌హేష్‌తో చేయ‌బోతున్న సినిమా త‌ర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న త‌ర్వాతి సినిమాను మొద‌లు పెట్ట‌బోతున్నాడ‌ట త్రివిక్ర‌మ్. మ‌హేష్ సినిమాను స‌మ్మర్‌లో రిలీజ్ చేసి, ఆ స‌మ్మ‌ర్‌లోనే బ‌న్నీతో సినిమాను స్టార్ చేయ‌నున్నాడ‌ట. ఆ లోపు బ‌న్నీ పుష్ప2 ను ముగించ‌బోతున్నాడు. పుష్ప2, మ‌హేష్28 సినిమాలు దాదాపు ఒకేసారి పూర్త‌య్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. కాబ‌ట్టి బ‌న్నీ, త్రివిక్ర‌మ్ ఏ మాత్రం టైమ్ తీసుకోకుండా సినిమాను మొద‌లుపెట్టి వ‌చ్చే ఏడాది చివ‌ర్లో లేదంటే 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టోరీ లైన్ ఇప్ప‌టికే సిద్ధం అయింది. స్క్రిప్ట్ వ‌ర్స్ కూడా దాదాపు పూర్త‌యిందని స‌మాచారం.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :