ASBL NSL Infratech

మరోసారి కెమెరాకి చిక్కిన సిద్దార్థ్, అదితి జంట...!

మరోసారి కెమెరాకి చిక్కిన సిద్దార్థ్, అదితి జంట...!

బాలీవుడ్ లో ఎంత మంది జంటలు ఉన్నా, సిధార్థ రూట్ ఏ సపరేట్. ఇప్పటికే పలు హీరోయిన్లతో రిలేషన్ లో ఉంది తన సినిమాలతో కన్నా, రూమర్స్ తోనే సిద్ధూ ఎక్కువ ఫేమస్ అయ్యాడంటే అతిశయోక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ నటనతో ఒక మార్క్ ని సెట్ చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం సినిమాలకంటే డేటింగ్ లతోనే ఎక్కువ బిజీగా ఉంటున్నాడు. అప్పట్లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంతతో ప్రేమాయణం నడిపి సంచలనం సృష్టించాడన్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ బ్యూటీ అదితి రావ్ హైదారి, సిద్దార్థ్ గత కొద్ది కాలంగా రిలేషన్ లో ఉన్నారు అన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ వార్తల్ని బలపరుస్తూ రీసెంట్ గా టాలీవుడ్ హీరో శార్వానంద్ ఎంగేజ్మెంట్ కి ఈ ఇద్దరు జంటగా రావడం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. తన కెరీర్ లో మొత్తం ఏడుగురు హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉన్న సిద్ధూ కొత్తగా ఇంకో హీరోయిన్ తో ప్రేమాయణం నడపడం ఏంటని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిటౌన్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. షికార్ల పేరుతో ఏదొక విధంగా సిద్ధూ, అదితి కెమెరా కంట పడుతూనే  ఉన్నారు. తాజాగా మరొకసారి ఈ జంట కెమెరాకి చిక్కింది. ఈ సారి సిద్దార్థ్ కాస్త జాగ్రత్త పడ్డాడు అనే చెప్పాలి. తనెవరో గుర్తు పట్టకుండా ఉండడానికి ఈ హీరో మాస్క్ ని ధరించాడు. జంటగా ఫోజులు ఇవ్వమని కెమెరామాన్ అడిగినా కూడా సిద్దార్థ్ సహకరించలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరి కెరీర్స్ లో వాళ్లు బిజీగా ఉన్నారు సిద్ధూ, అదితి. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి పీటలెక్కాలని ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. సిద్దార్థ్ విషయంలో ఈ బంధమైనా కలకాలం నిలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :