ASBL NSL Infratech

హమాస్ కు బైడెన్ సహా 18 దేశాల నేతల విజ్ఞప్తి.. తక్షణమే

హమాస్ కు బైడెన్ సహా 18 దేశాల నేతల విజ్ఞప్తి.. తక్షణమే

రఫాపై ఇజ్రాయెల్‌ దాడికి సిద్ధమవుతున్న వేళ బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్‌కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. 200 రోజులుగా బందీలుగా ఉంచుకున్న అందరినీ తక్షణం హమాస్‌  విడుదల చేయాలి. అందులో మా దేశ పౌరులూ ఉన్నారు. బందీలకు గాజాలోని పౌరులకు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా రక్షణ ఉంటుంది. బందీలను విడుదల చేస్తే తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. గాజా ప్రాంతానికి అవసరమైన మానవతా సాయం పంపేందుకు వీలవుతుంది. బందీలను ఇంటికి తీసుకొచ్చేందుకు జరుగుతున్న చర్చలకు మేం పూర్తిస్థాయిలో మద్దతిస్తున్నాం అని 18 దేశాలు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు అర్జెంటీనా,  ఆస్ట్రియా, బ్రెజిల్‌, ఒల్గేరియా, కెనడా, కొలంబియా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, హంగరి, పోలండ్‌, పోర్చుగల్‌, రొమేనియా, సెర్బియా, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌, బ్రిటన్‌ దేశాలు కూడా సంతకాలు చేశాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :