ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మిల్కీ బ్యూటీ ఫస్ట్ మూవీ ఎప్పుడు చేసిందో తెలుసా..?

మిల్కీ బ్యూటీ ఫస్ట్ మూవీ ఎప్పుడు చేసిందో తెలుసా..?

మిల్కీ బ్యూటీ తమన్నా అప్పుడు ఇప్పుడు తన అందంతో ప్రేక్షకుల మతి పోగొడుతూనే ఉంది. తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు తెలుగు, తమిళంతో పాటు కన్నడం మరియు హిందీ భాషల్లో కూడా పలు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన పాత్రలు అభిమానుల్లో చెరగని ముద్ర వేశాయి అనడంలో సందేహం లేదు. ఈ 17 ఏళ్ల సినీ కెరీర్ లో తమన్నా 50 సినిమాలకు పైగా చేసింది.

ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ కూడా అదరగొట్టింది. మ్యూజిక్ ఆల్బం లో కూడా తమన్నా నటించి మెప్పించింది. ఇప్పటికీ తమన్నా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది అంటే మామూలు విష్యం కాదు. ఈ బ్యూటీ తన మొదటి సినిమాను పదవ తరగతి చదివే సమయం లోనే అంటే 15 ఏళ్ల వయసులోనే చేసింది. 2005 లో "చాంద్ సా రోషన్ చెహరా" సినిమాలో నటించింది. అదే ఏడాది తెలుగు లో "శ్రీ"  సినిమాలో మంచు మనోజ్ జోడీగా నటించి టాలీవూడ్ లో అడుగుపెట్టింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. తమన్నాకి మొదటి సక్సెస్ శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ తెచ్చి పెట్టింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మిల్కీ బ్యూటీ. టాలీవుడ్ లోని యంగ్ స్టార్ హీరోలు అందరితో కూడా నటించిన ఘనత ఈ అమ్మడికి దక్కింది.

15 ఏళ్ల వయసు లో సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ తమన్నా 17 ఏళ్ల తర్వాత కూడా మంచి క్రేజ్ తో పాన్ ఇండియా స్థాయిలో దూసుకు పోతూ సినిమాలు చేస్తుంది. హీరోయిన్స్ ఇంత కాలం కెరీర్ ను కొనసాగించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తమన్నా ఇప్పటికి కూడా తన అందాలతో మైమరపిస్తుంది కనుకే ఇంత కాలం కెరీర్ లో కొనసాగింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాగే తన కేరీర్ ని మరికొంత కాలం ఈ అమ్మడు కొనసాగించాలని కోరుకుందాం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :