ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా ఈ విషయంలో వెనుకు తగ్గడం లేదు

అమెరికా ఈ విషయంలో వెనుకు తగ్గడం లేదు

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్‌ అయిన వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ విషయంలో అమెరికా అతి జాగ్రత్తలు తీసుకుంటోంది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ చైనాకు చెందినది కావడంతో ఈ విషయంలో అమెరికా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. టిక్‌టాక్‌ అడ్డుపెట్టుకొని తమ సైనికులకు చైనా వల వేసే అవకాశాలు ఉన్నాయనేది అమెరికా వాదన. కావున తమ సైనికులు ఎవరూ తమ అధికారిక మొబైల్‌ ఫోన్లలో టిక్‌టాక్‌ ఉపయోగించరాదని అమెరికా నేవీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అమెరికా ఆర్మీ కూడా ఇవే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్మీ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ రాబిన్‌ ఒచావో వెల్లడించారు. టిక్‌టాక్‌ను ఓ సైబర్‌ థ్రైట్‌గా ఆమె అభివర్ణించారు.

డిసెంబర్‌ నుంచే తాము సైనికులకు హెచ్చరికలు చేస్తూ వస్తున్నామని ఆమె తెలిపారు. టిక్‌టాక్‌ ద్వారా చైనా తమ సైనికుల వ్యక్తిగత విషయాలను తెలుసుకొని, దేశద్రోహం చేసే విధంగా వారిని బెదరింపులకు గురి చేసే అవకాశం ఉందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే, ఆది నుంచీ తమపై వస్తున్న ఆరోపణలను టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఖండిస్తూనే వస్తోంది. కావాలంటే టిక్‌టాక్‌ యాజమాన్యాన్ని విదేశీ కంపెనీలకు అమ్మడానికి కూడా సిద్ధమని ప్రకటించింది. కానీ అమెరికా మాత్రం ఆ విషయంలో వెనుకు తగ్గడం లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :