ASBL NSL Infratech

25కు చేరిన కరోనా కొత్త రకం కేసులు...

25కు చేరిన కరోనా కొత్త రకం కేసులు...

దేశంలో కరోనా కొత్త రకం వైరస్‍ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. తాజాగా మరో ఐదుగురికి కొత్త స్ట్రెయిన్‍ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కొత్తరకం కేసుల సంఖ్య 25కు చేరింది. పుణెలోని నేషనల్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ వైరాలజీలో నాలుగు, ఢిల్లీలోని ఐజీఐబీలో ఒక నమూనాలో ఈ స్ట్రెయిన్‍ను గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ 25 మందిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‍ రూం ఐసోలేషన్‍లో ఉంచినట్లు పేర్కొంది. కొత్త రకం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వైరస్‍ వ్యాప్తి నివారణకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. స్ట్రెయిన్‍ పాజిటివ్‍ల తోటి ప్రయాణికులు, బంధువులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత రెండు వారాల్లో భారత్‍కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది. వీరిలో కరోనా సోకిన వారికి జీనోమ్‍ పరీక్షలు నిర్వహించనుంది. కొత్త  స్ట్రెయిన్‍ వ్యాప్తి నేపథ్యంలో భారత్‍-యూకే మధ్య విమాన సర్వీసుల రద్దును మరో వారం పాటు పొడిగించింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :