ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డొనాల్డ్‌ ట్రంప్‌కు చుక్కెదురు

డొనాల్డ్‌  ట్రంప్‌కు చుక్కెదురు

వివిధ ముస్లిం దేశాల పౌరుల అమెరికా ప్రవేశంపై ఆంక్షల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏడు ముస్లిం ప్రాబల్య దేశాల నుంచి వలసలను, ప్రయాణాలను నిషేధిస్తూ జనవరిలో ఇచ్చిన ఉత్తర్వును కోర్టులు కొట్టివేయగా, ఈ నిషేధాన్ని ఆరు దేశాలకు పరిమితం చేస్తూ మార్చి 6న జారీచేసిన ఉత్తర్వుకూ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. దీని అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ ఒకే రోజు హవాయి, మేరీల్యాండ్‌ రాష్ట్రాల్లోని రెండు సమాఖ్య(ఫెడరల్‌) న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చాయి. ముస్లింలపై ట్రంప్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయన మతపర వివక్షను చాటుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నాయి.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :