Revanth Reddy:కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya)తో భేటీ అయ్యారు. తెలంగాణ(Telangana)లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖేల్ ఇండియా(Khel India), 40వ జాతీయ క్రీడలు నిర్వహణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖేల్ ఇండియా కింద శిక్షణ , వసతుల అభివృద్ధికి నిధులివ్వాలి. జాతీయ క్రీడల్లో పాల్గొనేవారికి రైలు ఛార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.