న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ను సందర్శించిన సీఎం రేవంత్, బృందం

అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్ నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీ, అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీని రేవంత్‌రెడ్డి సందర్శించారు. సీఎం వెంట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా వారితో సమావేశమై వివరాలను తెలుసుకున్నారు.