Kalvakuntla Kavitha : కేంద్రం ఆమోదించకపోతే.. రైల్‌రోకో చేస్తాం

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ఢల్లీిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల బిల్లు (BC Reservation Bill )ను కేంద్రం ఆమోదించకపోతే జులై 17న రైల్‌రోకో (Railrock) చేస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు సాధించేవరకు పోరాడతామని హెచ్చరించారు. రైల్‌రోకోకు మద్దతు కోరుతూ బుధవారం అన్ని పార్టీల (All parties) కు లేఖ రాస్తామని తెలిపారు.